నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అలా అర్థమైందా? టీచర్‌: చంటీ.. ఒంట్లో బాగోలేదని పది రోజులు సెలవు పెట్టావు కదా!  

Published : 29 Mar 2023 00:53 IST

అలా అర్థమైందా?
టీచర్‌: చంటీ.. ఒంట్లో బాగోలేదని పది రోజులు సెలవు పెట్టావు కదా!  
చంటి: అవును టీచర్‌..

టీచర్‌: మరి వచ్చేటప్పుడు డాక్టర్‌ సర్టిఫికెట్‌ తీసుకురమ్మని చెప్పాను కదా.. ఎందుకు తీసుకురాలేదు?
చంటి: అడిగాను టీచర్‌.. కానీ, అంత కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరదని కసురుకున్నారా డాక్టర్‌..  
ముందే చెప్పాలి కదా..

టీచర్‌: చిట్టీ.. నీకు ఏ సబ్జెక్ట్‌ అంటే ఇష్టం?
చిట్టి: మ్యాథమెటిక్స్‌ టీచర్‌..

టీచర్‌: అయితే, ఒకసారి స్పెల్లింగ్‌ చెప్పు..?
చిట్టి: కాదు కాదు టీచర్‌.. నాకు హిందీ అంటే ఇష్టం..  
అవీ చెప్పేస్తే సరి!

టీచర్‌: పిల్లలూ.. పాఠాలన్నీ చెప్పడం పూర్తయింది. ఎల్లుండి నుంచి మీకు పరీక్షలు ఉంటాయి. ఏమైనా సందేహాలుంటే ఇప్పుడే అడగండి.
కిట్టు: పరీక్షల్లో ఏ ప్రశ్నలు వస్తాయి టీచర్‌..?

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని