నవ్వుల్‌... నవ్వుల్‌..!

ఎంత చెప్పినా..!

Published : 15 Nov 2023 00:12 IST

ఎంత చెప్పినా..!

టీచర్‌: వేమన శతకం రాసింది ఎవరు?

పింకీ: తెలీదు టీచర్‌..

టీచర్‌: సరే.. నీకు ఒక క్లూ ఇస్తాను.. నేనడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది..

పింకీ: అయితే.. వేమన శతకం రాసింది శతకం అనే కవి టీచర్‌..

తు.చ. తప్పకుండా..

కిట్టు: చంటీ.. నృత్య ప్రదర్శన అక్కడ జరుగుతుంటే, ఇక్కడ నిల్చున్నావేంటి?

చంటి: మా టీచర్‌ చెప్పిన విషయాన్ని అనుసరిస్తున్నా కిట్టూ..!

కిట్టు: ఏంటది?

చంటి: దేన్నయినా దూరదృష్టితో చూడాలని చెప్పారు..!

నేను చూసిందప్పుడే మరి..

టీచర్‌: బంటీ.. నిన్న స్కూల్‌కి రాలేదేంటి?

బంటి: ‘టుడే హాలీడే’ అని మా ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది టీచర్‌..!

టీచర్‌: అదేంటి.. అది పంపించింది మొన్న కదా..

బంటి: ఏమో టీచర్‌.. ఆ మెసేజ్‌ను నేను నిన్ననే చూశాను..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు