మ్యాక్స్.. సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్!
హాయ్ నేస్తాలూ.. సాధారణంగా నాలుగేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు? రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటూ, ఇంట్లోని సామగ్రిని చిందరవందరగా పడేస్తూ.. విపరీతమైన అల్లరి చేస్తుంటారు కదూ! సరిగ్గా దుస్తులు కూడా వేసుకోవడం రాని వయసు అది.
హాయ్ నేస్తాలూ.. సాధారణంగా నాలుగేళ్ల వయసు పిల్లలు ఏం చేస్తుంటారు? రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటూ, ఇంట్లోని సామగ్రిని చిందరవందరగా పడేస్తూ.. విపరీతమైన అల్లరి చేస్తుంటారు కదూ! సరిగ్గా దుస్తులు కూడా వేసుకోవడం రాని వయసు అది. కానీ, ఓ బుడతడు మాత్రం ఏకంగా డిజైనర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. మరి, తనకి సంబంధించిన వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.
అమెరికాకు చెందిన మ్యాక్స్ అలెగ్జాండర్‌కు ప్రస్తుతం ఏడు సంవత్సరాలు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పటి నుంచే సొంతంగా వస్త్రాలు డిజైన్ చేయడం ప్రారంభించాడు. అలా ఇప్పటికే వందకు పైగా డిజైన్లను తయారు చేసి, ప్రముఖులకు అందిస్తూ.. అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీగా మారిపోయాడు.
తల్లిదండ్రులే ఆశ్చర్యపోయారు..
చిన్నతనంలో ఒకరోజు మ్యాక్స్.. వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి మానిక్వీన్(వస్త్ర దుకాణాల్లోని డిస్‌ప్లేలో ఉండే బొమ్మ) కావాలని అడిగాడు. అప్పుడామె ‘అవి నీకెందుకు?’ అని అడగడంతో.. ‘నేను దుస్తులు డిజైన్ చేస్తాను’ అని సమాధానమిచ్చాడట. అప్పటివరకూ తమ కుమారుడిలోని ప్రతిభను తల్లిదండ్రులు కూడా గుర్తించలేదట. కార్డ్‌బోర్డు ఆర్టిస్టు అయిన వాళ్లమ్మ, ఆ మరుసటి రోజే అట్టముక్కలతో ఓ మానిక్వీన్‌ని తయారు చేసి ఇచ్చారు. ఆ తర్వాత ఓ వారం పాటు కష్టపడి సొంతంగా ఒక డిజైన్‌ను రూపొందించాడా బాబు. కుట్టడం దగ్గర్నుంచి.. అన్ని పనులూ తానే స్వయంగా చేసుకున్నాడు. ‘తమ కుమారుడికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందా?’ అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటే.. వాళ్ల తాతలు టైలరింగ్ చేసే విషయం గుర్తుకువచ్చిందట. అలా ఆ లక్షణాలే తమ కుమారుడికీ వచ్చాయని పొంగిపోతున్నారు. పనిలో మరింత నైపుణ్యం సాధించేందుకు మ్యాక్స్‌ను ఇంటి సమీపంలోని ఓ శిక్షణ కేంద్రంలో చేర్పించారట.
వారానికో డిజైన్..
మ్యాక్స్ దుస్తులు డిజైన్ చేస్తున్నప్పుడు, కుడుతున్నప్పుడు తన సోదరుడు డోరియన్ సహాయం తీసుకుంటాడట. ఇద్దరూ కలిసి ఎంచక్కా వస్త్రాలు డిజైన్ చేసేస్తారు. ఒక్క డ్రెస్ పూర్తి చేయడానికి తనకు వారం రోజుల సమయం పడుతుందని చెబుతున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఫ్యాషన్ డిజైనర్‌గా చాలా మంచి పేరు తెచ్చుకున్న తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పదిహేను లక్షలకు పైగానే ఫాలోవర్లు ఉన్నారు. ప్రతి డిజైన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో, వాటిని చూసిన నెటిజన్లు.. బుడతడి ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
సాధనే మార్గమని..
ఏడేళ్లకే సెలబ్రిటీ డిజైనర్‌గా మారిన మ్యాక్స్.. చదువులోనూ ముందేనట. తరగతులకు హాజరవుతూనే.. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం డిజైన్ స్టూడియోలోనే ఎక్కువ సమయం గడుపుతాడట. తన డిజైన్లతో ఇప్పటికే ఫ్యాషన్ షోలు కూడా నిర్వహించాడు. ఏదైనా పనిలో నైపుణ్యం సాధించాలంటే, సాధనకు మించిన మార్గం లేదని చెబుతున్నాడు. నేస్తాలూ.. ఈ బుజ్జి డిజైనర్‌కు మనమూ ఆల్ ది బెస్ట్ చెబుదామా..!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: సీఐడీ చీఫ్ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్ ఫిర్యాదు
-
Cricket News: అత్యాచార ఆరోపణల నుంచి నిర్దోషిగా బయటపడిన శ్రీలంక క్రికెటర్
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో