ఇంట్లో శాస్త్త్ర్రరీత్యా జాగ్రత్తలివీ
నగరంలోని ఇంటి ఆవరణలో నీరు నిల్వ చేసుకునేందుకు సంపులు అనివార్యం. రోజు విడిచి రోజు జలమండలి సరఫరా చేసే నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ఎనిమిది నుంచి పది అడుగుల లోతులో భూగర్భంలో సంపులను తవ్వుతున్నారు.
సంపులతో పొంచి ఉన్న ప్రమాదం
ఈనాడు, హైదరాబాద్
నగరంలోని ఇంటి ఆవరణలో నీరు నిల్వ చేసుకునేందుకు సంపులు అనివార్యం. రోజు విడిచి రోజు జలమండలి సరఫరా చేసే నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ఎనిమిది నుంచి పది అడుగుల లోతులో భూగర్భంలో సంపులను తవ్వుతున్నారు. ఇంటి ప్రధాన ద్వారం ముంగిటే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పిల్లలు తిరిగే ప్రదేశంలో వీటి ఏర్పాటు వల్ల మూత వేయడం మర్చిపోయినప్పుడు ప్రమాదవశాత్తు అందులో పిల్లలు పడిపోతున్నారు. ఏటా అభం శుభం తెలియని చిన్నారులు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తురీత్యా వీటి ఏర్పాటు ఎక్కడ మేలు? ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు వాస్తునిపుణులు పి.కృష్ణాదిశేషు.
వాస్తు రీత్యా బావి, బోరుబావి ఇంటి ప్రాంగణంలో తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో ఉత్తమం. కుదరని పక్షంలో తూర్పు, ఉత్తర దిక్కులలో ఉండవచ్చు.
* నీటి తొట్టెలకు మాత్రం తూర్పు, ఉత్తర ఈశాన్య దిక్కులలో మాత్రమే అనుకూలంగా ఉంటాయి.
* పడమర వాయువ్యం, దక్షిణ ఆగ్నేయం మూలలో కూడా శాస్త్ర సమ్మతమే.
* పడమర నైరుతి, దక్షిణ నైరుతిలలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాస్త్రరీత్యా మంచి ఫలితాలు ఇవ్వవు.
* కాలనీల్లో నీటి సరఫరా పైపులైను రోడ్డువైపు నుంచి వస్తుంది. కాబట్టి ఇంటికి తూర్పు, ఉత్తరం వైపు రోడ్డు ఉంటే సంపులు తూర్పు ఈశాన్యం, ఉత్తరం ఈశాన్యంలో ఎక్కడైనా ఉండవచ్చు.
* పడమర రోడ్డు ఉన్నట్లయితే పడమర వాయువ్యం, దక్షిణ దిక్కులో ఉంటే దక్షిణ ఆగ్నేయంలో సంపులు ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
భద్రతా ముఖ్యమే..
* వాస్తు జాగ్రత్తలే కాదు సంపుల ఏర్పాటులో భద్రత సైతం ప్రధానమైంది.
* ఎట్టి పరిస్థితుల్లో ఇంటి గుమ్మాలకు ఎదురుగా ఉండకూడదు. గేట్లకు ఎదురుగా, నడక దారిలో లేకుండా ఏర్పాటు చేసుకుంటే మేలు.
* ప్రమాదాలు చెప్పిరావు కాబట్టి సంపులకు రెండురకాల మూతలు ఏర్పాటు చేసుకోవాలి. లోపలివైపు ఇనుపజాలీతో మూత ఉండాలి. ఆపైన మరోమూత ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో రెండు మూతలు తప్పనిసరి. జాలీ మూత ఎప్పుడు మూసే ఉండాలి. పిల్లలు వాటిపై కాలుపెట్టినా తట్టుకునేలా జాలీ మూతలు ఉండాలి. ః వీటిని శుభ్రం చేసేందుకు లోపలికి దిగి గాలి ఆడక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి. జాలీ మూత ఉంటే లోపలికి దిగినా గాలి వెలుతురు ఆడుతుంది.
* సంపులోంచి ఇంటిపైన ఉండే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌లోకి నీటి పంపిణీ చేసేందుకు సంపు అడుగు భాగంలో మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్తు తీగలు సైతం నీటిలోనే ఉంటున్నాయి. కాబట్టి ఏదైనా తీగలు ఎక్కడైనా తెగినా విద్యుదాఘాతాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి సంపులోకి సరఫరా అయ్యే విద్యుత్తు లైన్ ఆపేసిన తర్వాత మాత్రమే నీటిలోకి దిగాలి. మోటార్ నడిచేటప్పుడు నీటిని సైతం తాకవద్దు.
* నిర్మాణంలో ఉన్న సంపులలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. మూతలు లేకపోవడమే ఇందుకు కారణం. కూలీల పిల్లలు పని ప్రదేశంలో ఆడుకుంటూ పొరపాటున అందులో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి నిర్మాణంతోపాటూ మూతలను సిద్ధం చేసుకోవాలి. ఎల్లప్పుడూ మూసే ఉంచాలి. కనీసం ఇనుపజాలీ అయినా ఏర్పాటు చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్‌లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..
-
Mansion 24 Trailer: ఆ భవంతిలోకి వెళ్లిన వారందరూ ఏమయ్యారు: ‘మాన్షన్ 24’ ట్రైలర్