కార్యాలయాల నిర్మాణాల్లో పోటాపోటీ..

కొత్త కార్యాలయాల నిర్మాణాలు గతేడాది దేశంలోకెల్లా అత్యధికంగా 13.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో పూర్తయ్యాయి.

Updated : 10 Feb 2024 05:21 IST

ఈనాడు, హైదరాబాద్‌ : కొత్త కార్యాలయాల నిర్మాణాలు గతేడాది దేశంలోకెల్లా అత్యధికంగా 13.5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్‌లో పూర్తయ్యాయి. దేశవ్యాప్త నిర్మాణాల్లో చూస్తే హైదరాబాద్‌ వాటా 28 శాతంగా ఉంది. 2022లో 11.3 మి.చ.అ. విస్తీర్ణంలో పూర్తవగా... పెరుగుదల 19 శాతంగా నమోదైంది.  వెస్టియన్‌ రీసెర్చ్‌ ప్రకారం.. బెంగళూరు, హైదరాబాద్‌ రెండూ పోటీపోటీగా కార్యాలయాలను నిర్మించాయి. బెంగళూరులో సైతం 2023లో 13.4 మి.చ.అ. విస్తీర్ణంలో పూర్తి చేశారు. ఈ రెండు నగరాల వాటా దేశంలోనే 56 శాతంగా ఉండటం విశేషం.  చెన్నైలో 6.7 మి.చ.అ., పుణె, దిల్లీలో ఒక్కోచోట 5.3 మి.చ.అ. కార్యాలయాల భవనాలు నిర్మించారు.

అద్దెల పరంగా.. : కార్యాలయాల్లో గత సంవత్సరం చదరపు అడుగు సగటు అద్దె అత్యధికంగా ముంబయిలో రూ.124.50 ఉండగా.. బెంగళూరులో రూ.85 ఉంది. హైదరాబాద్‌లో రూ.66.60గా నమోదైంది. ముంబయితో పోలిస్తే 87 శాతం చౌక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని