గడువు 3 నెలలు పొడిగించరూ!

రాష్ట్రంలో 21 రోజుల లాక్‌డౌన్‌తో నిర్మాణ ప్రాజెక్ట్‌లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఎంతకాలం ఇది కొనసాగుతుందో తెలియని అనిశ్చితి. మరోవైపు ఈ నెల, వచ్చేనెలలో ప్రాజెక్ట్‌ పూర్తి చేసి అప్పగిస్తామని పలు నిర్మాణసంస్థలు తెలంగాణ రెరాలో తుది గడువుని పేర్కొన్నాయి. లాక్‌డౌన్‌తో పనులు ముందుకు సాగడం లేదు. భవన నిర్మాణ కూలీలు కొందరు మినహా మిగతావారందరూ సొంతూళ్లకు వెళ్లారు.

Published : 04 Apr 2020 01:56 IST

తెలంగాణ ‘రెరా’ని కోరుతున్న నిర్మాణదారులు
మహారాష్ట్రలో ఇప్పటికే అమలు
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో 21 రోజుల లాక్‌డౌన్‌తో నిర్మాణ ప్రాజెక్ట్‌లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. ఎంతకాలం ఇది కొనసాగుతుందో తెలియని అనిశ్చితి. మరోవైపు ఈ నెల, వచ్చేనెలలో ప్రాజెక్ట్‌ పూర్తి చేసి అప్పగిస్తామని పలు నిర్మాణసంస్థలు తెలంగాణ రెరాలో తుది గడువుని పేర్కొన్నాయి. లాక్‌డౌన్‌తో పనులు ముందుకు సాగడం లేదు. భవన నిర్మాణ కూలీలు కొందరు మినహా మిగతావారందరూ సొంతూళ్లకు వెళ్లారు. నిర్మాణ సామగ్రి రవాణా స్తంభించిపోయింది. ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసినా పరిస్థితులు గాడిన పడటానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి తరుణంలో ఈ రెండుమూడు నెలల్లో పూర్తిచేయాల్సిన నిర్మాణాలే కాదు మున్ముందు పూర్తిచేయాల్సిన ప్రాజెక్ట్‌లపైనా దీనిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిర్మాణదారులు అంటున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల తుది గడువును పొడిగించాలని కోరుతున్నారు. లేదంటే డిఫాల్ట్‌ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. మహారాష్ట్రలో రెరా మూడునెలల గడువును పొడిగిస్తూ ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసిందని.. ఇదే మాదిరి తెలంగాణలోనూ మూడు నెలల గడువును పొడిగించాలని రెరాను(రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ) క్రెడాయ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి కోరారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని