పూల పరిమళంతో పాటు.. ఔషధ మొక్కలూ అవసరమే

నగరంలో పచ్చదనం పెరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అయినా.. వ్యక్తిగత ఇల్లయినా ఇంటికి పూల మొక్కలు ఎంత అందమో.. ఔషధ మొక్కలూ అంత అవసరం అనేది గుర్తిస్తున్నారు.

Updated : 11 Feb 2023 03:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పచ్చదనం పెరుగుతోంది. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అయినా.. వ్యక్తిగత ఇల్లయినా ఇంటికి పూల మొక్కలు ఎంత అందమో.. ఔషధ మొక్కలూ అంత అవసరం అనేది గుర్తిస్తున్నారు. అందుకే ప్రతి గదిలోనూ ఇవి ఉండేలా చూసుకుంటున్నారు. గులాబీ ఒత్తిడి తగ్గిస్తుంది.  పాన్‌లలో వీటి రేకులను వాడతారు. తాజా పూలరేకులు తింటే సరిపోతుంది. ఇలా మొక్కల పెంపకం ఉత్సాహాన్నిస్తుంది. అవి చిగురిస్తే ఆనందం, పైకి పాకుతున్న పాదులు, వాటికి కాసిన కాయలు ఇలా ప్రతి పరిణామం మనసుకు హాయినిస్తుంది.

* తులసి: ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోనే తులసి మొక్కను వేయాల్సిన అవసరంలేదు.. అపార్టుమెంట్‌ బాల్కనీలోనూ ఎండతగిలే చోట పెంచవచ్చు.  తులసి ఆకులను ప్రతిరోజూ తినడం వల్ల జ్వరం, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు దూరమవుతాయి.

 

* మెంతి:  ఆకు కూరలలో ముఖ్యమైనది మెంతికూర. పిల్లలకు కడుపు నొప్పిని తగ్గించడం, పెద్దలకు శరీరంలో వేడిని నియంత్రించడం, కాలేయ సంబంధిత క్యాన్సర్‌ రాకుండా సైతం మెంతి ఆకులు ఉపయోగపడతాయి.

* కలబంద: ఆరోగ్యంతో పాటు అందానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం కలబంద జ్యూస్‌ తాగడం వల్ల గాయాలు, వాపులు వంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం, జీవన శైలి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వీటితో పాటు పుదీనా, బ్రహ్మి, నిమ్మ వంటి ఔషధ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. బాసిల్‌ మొక్క ఆకులను వంటల్లోనూ ఉపయోగిస్తారు. పిత్త, వాత, కఫ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని