నీరు, విద్యుత్తు ఆదా చేసే భవనాలు

వేసవితో సంబంధం లేకుండా నేటి ఇళ్లలో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. ఎండాకాలం వస్తే కరెంట్‌ బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతుంటాయి.

Updated : 05 Mar 2022 06:39 IST

ఈనాడు, హైదరాబాద్‌

వేసవితో సంబంధం లేకుండా నేటి ఇళ్లలో విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటుంది. ఎండాకాలం వస్తే కరెంట్‌ బిల్లులు మరింతగా జేబుకు చిల్లు పెడుతుంటాయి. ఇదంతా ఇంట్లో చల్లదనం, లైటింగ్‌ కోసమే. ఇల్లే సహజసిద్ధంగా చల్లగా ఉండేలా.. పగటిపూట వెలుతురు ఉండేలా ఇంటి వాతావరణం ఉంటే.. సాధ్యమైనంత తక్కువగా విద్యుత్తు వాడకం ఉంటుంది. కరెంటే కాదు సొంత ఇల్లు కొంటున్నప్పుడు నీటి ఆదా చేసే ప్రాజెక్ట్‌లవైపే మొగ్గు చూపుతున్నారు నేటితరం గృహ కొనుగోలుదారులు. మరి ఎలా గుర్తించేది?

ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) హరిత భవనాలకు రేటింగ్‌ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపర్చే అంశాల ఆధారంగా పాయింట్లను కేటాయిస్తారు. వాటిని బట్టి సిల్వర్‌, గోల్డ్‌, ప్లాటినమ్‌ రేటింగ్‌ ఇస్తారు. 

* పెద్ద ప్రాజెక్టులన్నీ భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్‌వెల్స్‌ రీఛార్జ్‌ అయ్యేలా.. ఇంజెక్షన్‌ వెల్స్‌, ఇంకుడుగుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్‌కు, ఇంట్లో టాయిలెట్‌ ఫ్లషింగ్‌కు ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితంగా నీరు చాలావరకు తిరిగి వినియోగం అవుతుంది. రేటింగ్‌లో ఇది ముఖ్యభూమికను పోషిస్తుంది. నీటి ఆదా 30 - 50 శాతం వరకు ఉంటోంది.

* ఇదివరకు ఇళ్లలో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉండేది. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు పెరిగిపోయాయి. ఏసీ వాడకం పెరిగింది.  తనిర్మాణ సమయంలోనే గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామగ్రిని ఉపయోగిస్తే చాలావరకు సమస్య తీరినట్లే కదా!  వీటితో విద్యుత్తు ఆదా  20-30 శాతం వరకు ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని