పూల బిస్కెట్లు నచ్చాయా..!

బిస్కెట్లు అనగానే... తియతియ్యగా ఉండేవి లేదా కాస్త కారంగా ఉండేవే సాధారణంగా గుర్తుకొస్తాయి. కానీ ఈ బిస్కెట్ల రూటే వేరు. ఇవి అందమైన పూల రేకలతో ముస్తాబై ఉంటాయి. కేవలం అలంకరణ కోసమే వీటిని ఇలా ముస్తాబు చేశారనుకుంటే పొరపాటే. వీటిని ఎంచక్కా తినేయొచ్చు కూడా.

Updated : 01 Nov 2020 04:25 IST

ఫుడ్‌ఆర్ట్‌

బిస్కెట్లు అనగానే... తియతియ్యగా ఉండేవి లేదా కాస్త కారంగా ఉండేవే సాధారణంగా గుర్తుకొస్తాయి. కానీ ఈ బిస్కెట్ల రూటే వేరు. ఇవి అందమైన పూల రేకలతో ముస్తాబై ఉంటాయి. కేవలం అలంకరణ కోసమే వీటిని ఇలా ముస్తాబు చేశారనుకుంటే పొరపాటే. వీటిని ఎంచక్కా తినేయొచ్చు కూడా. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పూలను ఇలా బిస్కెట్ల మీద అద్దుతున్నారు. అంటే రుచికరంగా ఉండే బిస్కెట్లకు రంగు రంగుల పూలరేకలను అంటించి పోషకాలనూ జతచేస్తున్నారు. చూడచక్కని ఈ బిస్కెట్లను వినియోగదారులు ఎంతో ముచ్చటపడి కొనుక్కుంటున్నారట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని