39 ఏళ్లు... 40 రకాల దోశలు!
నోరూరించే ఉలవచారు దోశ... లొట్టలేసుకుంటూ తినాలనిపించే లేస్ దోశ.. తియ్యతియ్యని.. చల్లచల్లని ఐస్‌క్రీమ్ దోశ... ఇవేవో వెరైటీగా ఉన్నాయి కదా.. విజయవాడకు చెందిన అంజిబాబు ఇలా వైవిధ్యమైన దోశలను చేస్తూ భోజనప్రియుల మనసు దోచుకుంటున్నారు.
విజయవాడ కేదారేశ్వరపేట ఒకటో వీధిలో గణేష్ భవన్ పేరుతో టిఫిన్ సెంటర్ ఉంటుంది. దీని యజమాని అంజిబాబు (అసలు పేరు మాధవాంజనేయ). 1982లో ఈ హోటల్‌ను ఆయన తండ్రిగారు ప్రారంభించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ వ్యాపారాన్ని అంజిబాబు ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
అందుబాటు ధరలో రుచికరమైన దోశలను తయారు చేస్తున్నారు. నాణ్యమైన నెయ్యితో తయారు చేస్తున్న టిఫిన్లు తినేందుకు ఇక్కడ రోజూ జనం క్యూ కడతారు. ఈ హోటల్ దాదాపు 40 రకాల దోశలకు పెట్టింది పేరు.
రాజకీయ నాయకులూ.. ఇక్కడ టిఫిన్ తినేందుకు నాయకులూ ఇష్టపడతారు. వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు విజయవాడ వస్తే తప్పనిసరిగా ఈ హోటల్లో టిఫిన్ చేయాల్సిందే.
సినీ ప్రముఖులు సైతం.. ‘రాజమౌళి, కీరవాణి, ఎల్.బి.శ్రీరామ్, శివారెడ్డి, తనికెళ్ల భరణి, కవిత తదితర సినీ ప్రముఖలు ఈ హోటల్ రుచులకు ఫిదా అయ్యారని చెబుతారు అంజి బాబు. సినిమావాళ్లు విజయవాడకు వస్తే తప్పనిసరిగా ఇక్కడికి వస్తారని చెబుతారాయన.
యువత రుచులే టార్గెట్.. యువత ఇష్టపడే రుచులకు ప్రాధాన్యమిస్తూ టిఫిన్లు తయారు చేస్తున్నారు. అలాగే పిల్లలకు కావాల్సి లేస్, చాక్లెట్, ఐస్‌క్రీం దోశలకూ మంచి డిమాండ్ ఏర్పడింది.
- వి.వి. రమణ ఈనాడు, విజయవాడ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSWRES: తెలంగాణ గురుకుల సైనిక స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
-
Movies News
srirama chandra: సింగర్ అసహనం.. ఫ్లైట్ మిస్సయిందంటూ కేటీఆర్‌కు విజ్ఞప్తి..!
-
India News
Temjen Imna Along: ‘నా పక్కన కుర్చీ ఖాళీగానే ఉంది’.. పెళ్లి గురించి మంత్రి ఆసక్తికర ట్వీట్
-
General News
TSPSC: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు
-
Politics News
KTR: మోదీ ఎవరికి దేవుడు? ఎందుకు దేవుడు: మంత్రి కేటీఆర్
-
Sports News
IND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. అక్కడ టీమ్ఇండియాకు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్