బలవర్ధక ఆహారం!

చిరుధాన్యాలైన రాగులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అవేంటో చూద్దామా...

Published : 29 Aug 2021 00:41 IST

చిరుధాన్యాలైన రాగులు అందించే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. అవేంటో చూద్దామా...

* రాగుల్లో క్యాల్షియం, ప్రొటీన్లు, మినరల్స్‌తోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అధికంగా ఉంటాయి. వీటి నుంచి ఎస్సెన్షియల్‌ అమైనో ఆమ్లాలు లభ్యమవుతాయి.

* వీటిని మొలకెత్తించి తీసుకుంటే బోలెడు లాభాలు.

* రాగుల్లో పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి వీటితో తయారుచేసిన పదార్థాలను తినడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు.

* ఈ పిండితో చేసిన పదార్థాలను రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల ఊబకాయులు సులువుగా బరువు తగ్గొచ్చు. 

* వీటిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. దాంతో రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరిగి రక్తహీనత సమస్య ఎదురు కాదు. 

* వీటిని ఆహారంగానే కాదు ఔషధంగా కూడా వాడతారు.

* ఇవి చాలా బలవర్ధకమైనవి. సంకటి, జావ, రొట్టె ... ఇలా రకరకాలుగా తీసుకోవచ్చు. వీటివల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

* రాగుల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

* ఈ చిరుధాన్యాల నుంచి అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఈ పొడిని పాలలో కలిపి చిన్నారులకు తాగిస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. 

* రాగి పిండితో చేసిన జావ దప్పికను అరికట్టడమే కాకుండా శరీరానికి ఎనలేని శక్తిని అందిస్తుంది. 

* వీటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి రాగి మాల్ట్‌ను తరచూ తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు రాకుండా దృఢంగా ఉంటాయి. 

* ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రిస్తాయి. కాబట్టి స్థూలకాయులు, మధుమేహులు వీటిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. 

* అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. 

* రాగుల్లోని క్యాల్షియం, ఐరన్‌, నియాసిన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ పోషకాలు కండరాలను పటిష్టంగా ఉంచుతాయి..

* శరీరంలోని మలినాలను బయటకు పంపుతాయి.

* వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే మలబద్ధక సమస్య దరిచేరదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని