చిట్టి పునుగులు చేద్దామా!

సాయంత్రం వేళల్లో, వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈ చిట్టి చిట్టి పునుగులు చేసుకొని టమాటా పచ్చిమిర్చి పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో తింటే ఎవరైనా అమోఘమనాల్సిందే...

Published : 05 Feb 2023 00:43 IST

సాయంత్రం వేళల్లో, వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈ చిట్టి చిట్టి పునుగులు చేసుకొని టమాటా పచ్చిమిర్చి పచ్చడి లేదా కొబ్బరి చట్నీతో తింటే ఎవరైనా అమోఘమనాల్సిందే...

కావలసిన పదార్థాలు: బియ్యం- రెండు కప్పులు, మినపప్పు- కప్పు, జీలకర్ర- అరచెంచా, ఉల్లిగడ్డ- 1, సోడా- చిటికెడు, నూనె- వేయించడానికి సరిపడ, ఉప్పు- తగినంత.

తయారీ విధానం.. కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకుని ముందు రోజు కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. దాన్ని దోశ పిండిలా మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. పిండి పులిస్తేనే పునుగుల రుచి బావుంటుంది. మరుసటి రోజు ఆ పిండిలో తగినంత ఉప్పు, చిటికెడు సోడా, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. పాన్‌లో డీప్‌ ఫ్రైకి తగినంత నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత కలుపుకొన్న మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగులుగా అందులో వేసుకొని బాగా వేగ నిచ్చి తీస్తే సరి వేడి వేడి చిట్టి పునుగులు రెడీ.

రమాదేవి మన్నెం, గుంటూరు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని