ఈ పకోడీల రుచే వేరు!

మనమంతా తరచూ చేసుకునేవి ఉల్లి, పాలక్‌ పకోడీలు. కొంచెం ఆసక్తి ఉండాలే గానీ వీటిని ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు. అందుకే ఎవరికి తోచినట్లు వాళ్లు కొత్తకొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను చాలానే ప్రయోగాలు చేస్తుంటాను.

Published : 04 Feb 2024 00:03 IST

నమంతా తరచూ చేసుకునేవి ఉల్లి, పాలక్‌ పకోడీలు. కొంచెం ఆసక్తి ఉండాలే గానీ వీటిని ఎన్ని రకాలుగానో చేసుకోవచ్చు. అందుకే ఎవరికి తోచినట్లు వాళ్లు కొత్తకొత్తగా ప్రయత్నిస్తుంటారు. నేను చాలానే ప్రయోగాలు చేస్తుంటాను. వాటిల్లో కొబ్బరి నువ్వుల పకోడీలు ఒకటి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటికి కప్పు బియ్యప్పిండి, అర కప్పు శనగపిండి, చారెడు కొబ్బరి తురుము, రెండు చెంచాల నువ్వులు, పాలకూర, కొత్తిమీర ఒక్కో కట్ట, రెండు బంగాళదుంపలు, అల్లం అంగుళం ముక్క, నూనె మొదలైనవి అవసరమౌతాయి. ఎలా చేయాలంటే.. ఆకుకూరలను కడిగి, సన్నగా తరగాలి. బంగాళదుంపలు చెక్కు తీసి సన్నగా తురమాలి. రెండు పచ్చిమిరపకాయలను ముక్కలుగా కోయాలి. అల్లం పొట్టు తీసి నూరాలి. ఒక పాత్రలో వీటన్నిటినీ వేసి.. కాస్త కారం, పసుపు, ఉప్పు జోడించి.. కొన్ని నీళ్లతో గట్టి పిండి కలిపి.. కాగుతున్న నూనెలో పకోడీలు వేసి.. బంగారురంగులోకి మారాక.. తీసేయాలి. అంతే.. కరకరలాడే క్రిస్పీ కొబ్బరి నువ్వుల పకోడీలు రెడీ. ఇవి టొమాటో, పుదీనా లాంటి చెట్నీలు లేకపోయినా సూపర్‌గా ఉంటాయి. నచ్చితే మీరూ చేసి చూడండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని