నానబెట్టిన సెనగలు ఇంత మంచివా!

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిదేనా? సాధారణంగా ఉదయం పూట వర్కవుట్లు చేసిన తర్వాత తింటాం. అలా కాకుండా ముందు తినాలంటే ఏం తినాలి? ఎంత తినాలి అనే సందేహాలు ఉంటాయి.

Published : 18 Jun 2023 00:21 IST

ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం మంచిదేనా? సాధారణంగా ఉదయం పూట వర్కవుట్లు చేసిన తర్వాత తింటాం. అలా కాకుండా ముందు తినాలంటే ఏం తినాలి? ఎంత తినాలి అనే సందేహాలు ఉంటాయి. అలాంటప్పుడు ఈ నానబెట్టిన సెనగలు తిని చూడండి. ఎన్ని ప్రయోజనాలో..

నానబెట్టిన సెనగల్లో ఆరోగ్యానికి ఉపకరించే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తిని ఒకేసారి కాకుండా నెమ్మదిగా విడుదల చేస్తూ... వర్కవుట్లు చేసుకోవడానికి కావాల్సిన హుషారునీ, ఉత్తేజాన్నీ అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా కాకుండా నిదానంగా విడుదలయ్యేట్టు చేస్తాయి.

* దీనిలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయిలు తక్కువ. అందువల్ల కాసిని తిన్నా నిదానంగా శక్తిని విడుదల చేస్తూ, చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకుంటాయి. పైగా ఏదో ఒకటి తినాలనే కోరిక కలిగించవు. బరువు పెరిగే సమస్యా ఉండదు.

* నానబెట్టిన సెనగలు తింటే బ్రెస్ట్‌, లంగ్‌ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

* ముప్ఫై దాటిన తర్వాత ముఖంలో ముడతలు వస్తాయనే దిగులు మొదలవుతుంది. అలాంటి వారు కచ్చితంగా సెనగలు తినాల్సిందే. వీటికి చర్మాన్ని మెరిపించే శక్తి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని