మధ్యస్థంగా నీట్‌ పేపర్‌

 దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు.

Published : 06 May 2024 07:19 IST

కానూరు, న్యూస్‌టుడే:  దేశవ్యాప్తంగా జరిగిన నీట్‌ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. వీటిలో కొన్ని ఫార్ములా ఆధారంగా ఉన్నవి, విశ్లేషణ, సమయం తీసుకునే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. మొత్తం మీద ప్రశ్నాపత్రం మధ్యస్తంగా ఉందని విద్యారంగ నిపుణులు తెలిపారు. భౌతిక రసాయనశాస్త్రం నుంచి 18, కర్బన రసాయనశాస్త్రం నుంచి 15, అకర్బన రసాయనశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు అడిగారు. వీటిలో అడిగిన ప్రశ్నలన్నీ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్‌ట్‌ బుక్‌లో ఉన్నవాటికి అనుగుణంగా ఉన్నాయని మద్దినేని మురళీకృష్ణ తెలిపారు. ఇందులో ప్రశ్నలు సగటు విద్యార్థి కూడా రాసేలా ఉన్నాయని, కొన్ని ఎక్కువ సమయం పట్టే అవకాశముందన్నారు. వృక్షశాస్త్రంలో ఒక ప్రశ్న ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్‌ట్‌ బుక్‌లో నుంచి కాకుండా ఇవ్వడం జరిగిందని జీఎం జీవీరావు, అధ్యాపకులు ఈఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ అన్నారు. జంతుశాస్త్రంలో మొత్తం వచ్చిన ప్రశ్నలు 46 కాగా.. ప్రశ్నాపత్రం తేలికగా ఉందని రవిశంకర్‌ అన్నారు. రెండు ప్రశ్నలు తప్పుగా ఉన్నాయన్నారు. మొత్తం మీద నీట్‌ పేపర్‌లో ఎక్కువగా స్టేట్‌మెంట్‌ తరహా, మ్యాచింగ్‌ ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని తుమ్మల నరేంద్రబాబు అన్నారు. వీటివలన కొంచెం సమయం తీసుకుంటుందన్నారు. భౌతిక, రసాయన శాస్త్రాల్లో 2 నుంచి 3 ప్రశ్నలు వరకు క్లిష్టంగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని