షెజ్వాన్‌ ఫ్రైడ్‌ రైస్‌ మరింత రుచిగా..

మా అబ్బాయికి షెజ్వాన్‌ ఫ్రైడ్‌ రైస్‌ అంటే చాలా ఇష్టం. దీన్ని హోటల్‌ పద్ధతిలో రుచిగా చేయడం ఎలా?

Published : 22 Oct 2023 00:22 IST


మా అబ్బాయికి షెజ్వాన్‌ ఫ్రైడ్‌ రైస్‌ అంటే చాలా ఇష్టం. దీన్ని హోటల్‌ పద్ధతిలో రుచిగా చేయడం ఎలా?

  •  షెజ్వాన్‌ ఫ్రైడ్‌ రైస్‌కి బాస్మతి బియ్యం బాగుంటాయి. సమయానికి బాస్మతి లేకుంటే.. సోనా మసూరి లేదా చిట్టి ముత్యాలు (జాస్మిన్‌ రైస్‌) లాంటి నాణ్యమైన బియ్యం వాడండి.
  •  ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, కొంచెం ఉప్పు వేసి, 80% ఉడికించి, నీరు వార్చేస్తే మెత్తపడదు. ఆ అన్నాన్ని నూనె రాసిన పళ్లెంలో లేదా జల్లెడలో వేసి ఆరబెడితే పొడిపొడిగా ఉంటుంది.
  •  అన్నంలో కలిపే షెజ్వాన్‌ సాస్‌ రుచి.. మీరు తీసుకున్న మిరపకాయల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కనుక సాస్‌ ఇంట్లో తయారుచేస్తున్నట్లయితే.. దానికి అవసరమైనవన్నీ మేలైనవి ఉపయోగించండి. మార్కెట్లో దొరికేవి.. ఆయా బ్రాండ్స్‌ను బట్టి రుచిలో తేడాలుంటాయి. మీకు నచ్చిన బ్రాండ్‌ గుర్తుంచుకుని.. ఎప్పుడూ అదే వాడండి.
  •  చైనీస్‌ వంటకాలు ఏవైనా సరే.. హై ఫ్లేం మీద.. మధ్యమధ్యలో ఎగరేస్తూ చేసుకుంటేనే మంచి ఘుమాయింపుతో.. చాలా రుచిగా ఉంటాయి.
  •  షెజ్వాన్‌ రైస్‌లో అనాస పువ్వు పొడి తప్పకుండా వేయాలి. దీని వల్ల మంచి సువాసన, గొప్ప రుచి వస్తాయి.
  •  కూరగాయలను కూడా హై ఫ్లేమ్‌ మీదే వేయించాలి. 70% వేగితే చాలు. అంతకంటే ఉడికితే రుచి తగ్గిపోతుంది.
  •  దించే ముందు చిటికెడు పంచదార వేస్తే అదనపు రుచి వస్తుంది.

పవన్‌ సిరిగిరి, చెఫ్‌, హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని