మహా ఔదార్యం

యయాతి చక్రవర్తి సభలో కొలువు తీరి ఉండగా ఒక వ్యక్తి వచ్చి ‘మహా రాజా! నేను గురుదక్షిణ చెల్లించేందుకు గానూ మీ వద్దకు వచ్చాను. యాచన కారణంగా మనసుకు బాధ కలుగు తుంది. అందువల్ల ఇంత కావాలి- అని అడగలేను.

Updated : 01 Jun 2023 00:35 IST

యాతి చక్రవర్తి సభలో కొలువు తీరి ఉండగా ఒక వ్యక్తి వచ్చి ‘మహా రాజా! నేను గురుదక్షిణ చెల్లించేందుకు గానూ మీ వద్దకు వచ్చాను. యాచన కారణంగా మనసుకు బాధ కలుగు తుంది. అందువల్ల ఇంత కావాలి- అని అడగలేను. మీరే అర్థం చేసుకుని ఏదైనా దానంగా ఇవ్వండి ప్రభూ’ అన్నాడు.

రాజు తల పంకించి ‘ఇవ్వ శక్యం కాని వాటిని ఇస్తానని లేనిపోని మాటలు చెప్పను. ఇవ్వగలిగినదే ఇస్తాను. ఇంత ఇచ్చాను, అంత ఇచ్చాను అని గొప్పలు చెప్పుకోను, ప్రచారమే చేసుకోను’ అంటూ వెయ్యి గోవులను దానం చేశాడు. అతడు గో సహస్రాన్ని స్వీకరించి, రాజును దీవించి సంతోషంగా వెళ్లిపోయాడు. సంతోషంగా దానం చేసే దాత, దురాశ లేని ప్రతి గ్రహీతలకు వీరిద్దరూ ఉదాహరణ. ప్రచారం కంటే ప్రయోజనమే ముఖ్యంగా భావించి యయాతి చక్రవర్తిలా ఉదార స్వభావం కలిగుండాలి. అలాగే ఇస్తాడు కదాని ప్రతి గ్రహీత అవసరం లేనివాటిని కోరడం సబబు కాదు.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు