గురువు కంటనీరు పెడితే..

గురువు గొప్పతనాన్ని వివరించే శ్లోకమిది. గురు పాదాలను ఆశ్రయించి, ఆయన చెప్పే పాఠాలను ఆలకిస్తే లక్షలాది జీవజాతులు, విభిన్న వాతావరణాలతో ఉన్న ఈ భూమండలం మనకు అవగతమవుతుంది.

Published : 06 Jul 2023 00:38 IST

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్‌
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః

గురువు గొప్పతనాన్ని వివరించే శ్లోకమిది. గురు పాదాలను ఆశ్రయించి, ఆయన చెప్పే పాఠాలను ఆలకిస్తే లక్షలాది జీవజాతులు, విభిన్న వాతావరణాలతో ఉన్న ఈ భూమండలం మనకు అవగతమవుతుంది.

గురువులు దేహబలం కన్నా జ్ఞానబలంతోనే ప్రకాశిస్తుంటారు. ఆచార్యుని దైవంగా భావించడం మన సంప్రదాయం. ఆ మహనీయుని శిష్యులు వినయ సంపన్నులై సేవించాలే గానీ ఎట్టి పరిస్థితిలో కటువుగా మాట్లాడకూడదు. గురువును పరాభవిస్తే విపత్తులు తప్పవని చెబుతూ..

మహాత్మ గురుదేవానాం అశ్రుపాతః క్షితౌయది
దేశభ్రంశో మహద్దుఃఖం మరణంచ భవేద్రువమ్‌

ఉపదేశించిన శ్లోకమిది. ఎక్కడైతే గురువు దుఃఖితుడై ఆయన కళ్లలో నీరు స్రవించి, అది నేలపై పడుతుందో.. ఆ ప్రాంతం వినాశనం అవుతుంది, ఆపదలు ముంచుకొస్తాయి, బాధలు కలుగుతాయి.. ఒక్కోసారి మరణాలు కూడా సంభవిస్తాయన్నది భావం.

జి.జానకి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని