జ్ఞానబోధ మరీ శ్రేష్ఠం!

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) మస్జిదె నబవికి వెళ్లినప్పుడు, అక్కడ రెండు బృందాలు విడివిడిగా సమావేశం అయ్యాయి.

Published : 19 Oct 2023 00:16 IST

కసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) మస్జిదె నబవికి వెళ్లినప్పుడు, అక్కడ రెండు బృందాలు విడివిడిగా సమావేశం అయ్యాయి. అందులో ఒక బృందం దైవారాధన లో నిమగ్నమై ఉంది. రెండో సమూహం నిరక్షరాస్యులకు చదువు చెప్పే పనిలో ఉంది. అది చూసి ప్రవక్త మహనీయులు- ‘రెండు బృందాలూ మంచి పనే చేస్తున్నాయి. దైవాన్ని ఆరాధించడం మంచి సంగతి. అయితే దైవం అనుగ్రహిస్తే వారి విన్నపాలు స్వీకరించవచ్చు, లేకపోనూవచ్చు. రెండో బృందం జ్ఞానం లేనివారికి వివేకం, విచక్షణ నేర్పిస్తోంది. కనుక ఇదింకా మేలైన పని. నన్ను కూడా ఇక్కడికి బోధకుడిగానే పంపారు’ అంటూ రెండో బృంద సభ్యులతో కూర్చున్నారు. రాత్రివేళ ఒక గంట సమయం విజ్ఞాన చర్చల కోసం కేటాయించడం అనేది.. ఆ రాత్రంతా దైవారాధన చేయడంతో సమానం.  

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని