రాజర్షి.. బ్రహ్మర్షి..

వశిష్ట మహర్షితో ‘బ్రహ్మర్షి’ అని పిలిపించు కోవాలనేది విశ్వామిత్రుడి చిరకాల కోరిక. కానీ వశిష్టుడు ఆయనను ‘రాజర్షి’ అనే పిలవడం విశ్వామిత్రునికి నచ్చలేదు. అడ్డుగా ఉన్న వశిష్టుని హతమారిస్తే కానీ తనకు శాంతి లేదనుకున్నాడు.

Published : 26 Oct 2023 00:03 IST

వశిష్ట మహర్షితో ‘బ్రహ్మర్షి’ అని పిలిపించు కోవాలనేది విశ్వామిత్రుడి చిరకాల కోరిక. కానీ వశిష్టుడు ఆయనను ‘రాజర్షి’ అనే పిలవడం విశ్వామిత్రునికి నచ్చలేదు. అడ్డుగా ఉన్న వశిష్టుని హతమారిస్తే కానీ తనకు శాంతి లేదనుకున్నాడు. ఒక పున్నమి రాత్రి.. పర్ణశాల ఆవరణలో పొదల వెనుక దాక్కొని సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో భార్యతో కలిసి బయటకు వచ్చాడు  వశిష్టుడు. ‘వెన్నెలెంతË చల్లగా, ప్రకాశవంతంగా ఉందో’ అందామె. ‘నిజమే అరుంధతీ! విశ్వామిత్రుడి కీర్తిలా ప్రకాశిస్తోంది వెన్నెల’ అన్నాడాయన. అది విన్న విశ్వామిత్రుడు పరుగున వచ్చి, వశిష్టుడి పాదాలపై పడి మన్నించమంటూ విషయమంతా చెప్పాడు. వశిష్టుడు నవ్వి ‘బ్రహ్మర్షి విశ్వామిత్రా! వినయం, విధేయత, పూర్ణ భక్తి ఉన్నప్పుడే బ్రహ్మర్షి పిలుపుకు అర్హులవుతారు. అవి  ఇంతకుముందు లేవు కనుక రాజర్షి అన్నాను. ఇప్పుడు పశ్చాతాపంతో అవి నశించడాన బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను’ అన్నాడు వశిష్ట మహర్షి. 

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని