ఘంటానాదం ఎందుకు చేస్తారు?

దేవునికి హారతినిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ, ఇంట్లో పూజ సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలురకాల దుష్టశక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజాఫలాన్ని అందుకునే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు

Updated : 07 Feb 2019 21:47 IST

దేవునికి హారతినిచ్చే సమయంలో గంట కొడుతుంటారు. దేవాలయాల్లోనూ, ఇంట్లో పూజ సమయంలోనూ గంట కొట్టడం మనం చూస్తుంటాం. సృష్టిలో పలురకాల దుష్టశక్తులుంటాయి. ఇవన్నీ మనం దైవ ప్రార్థన ద్వారా అందుకునే పూజాఫలాన్ని పొందే సమయంలో ఆటంకాలు కలిగిస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వాటిని పారదోలేందుకు ఘంటానాదం చేస్తుంటాం. అయితే గుడిలోనూ, ఇంట్లోనూ పూజలకు వాడే గంటలు వేర్వేరుగా వుంటాయి. దేవాలయంలో పెద్ద గంటలు వుంటాయి. అదే ఇంట్లో పూజా సమయంలో మనం ఒక చేతితో చిన్న గంటను మోగించి మరో చేతితో హారతి ఇస్తాం. గంట శబ్దం మంగళకరం, శుభకరం. అందుకనే మన సంప్రదాయంలో గంటకు విశిష్టమైన ప్రాధాన్యత వుంది. తిరుమలలో శాత్తుమొర... తదితర సమయాల్లో గంటలు మోగిస్తారు. ఈ శబ్దాలను బట్టి భక్తులు దర్శనాలకు సిద్ధమవుతుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని