శాశ్వతః

విష్ణుసహస్రనామావళిలో ఇది 56 వది. శాశ్వతః అంటే కాలంతో మార్పు చెందక ఎప్పటికీ స్థిరంగా వుండే ఒకే ఒక్కడని అర్థం.

Published : 13 Jul 2023 01:43 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 56 వది. శాశ్వతః అంటే కాలంతో మార్పు చెందక ఎప్పటికీ స్థిరంగా వుండే ఒకే ఒక్కడని అర్థం. ఈ భావన పదే పదే వివిధ నామాల్లో బహిర్గతంగానో, అంతరార్థంగానో కనిపిస్తుంటుంది. అందుకు కారణం ఆ స్వామి అస్తిత్వం అంతటిదని వివరించటమే. ఈ నామం కూడా ఆయనే శాశ్వతుడు, వేరొకరెవరూ కాదు అని స్పష్టం చెయ్యటమే. దీని వెనుక స్వామి విషయంలో అప్రమత్తంగా ఉండమనే సూచన, ఆంతర్యం ఉన్నాయి.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని