దోషాలు పోగొట్టే నిమ్మకాయదీపం

కుజ, కాలసర్పదోషాలు, కుటుంబ, వ్యాపార పరమైన సమస్యలతో బాధపడుతున్నవారికి నిమ్మకాయ దీపం చక్కని తరుణోపాయం. నిమ్మకాయలను శక్తి స్వరూపిణిగా భావిస్తారు.

Published : 13 Jul 2023 01:50 IST

కుజ, కాలసర్పదోషాలు, కుటుంబ, వ్యాపార పరమైన సమస్యలతో బాధపడుతున్నవారికి నిమ్మకాయ దీపం చక్కని తరుణోపాయం. నిమ్మకాయలను శక్తి స్వరూపిణిగా భావిస్తారు. అందుకే వాటిని మాలగా గుచ్చి పార్వతీదేవికి, గ్రామదేవతలకు అలంకరిస్తారు. దీపం పెట్టేందుకు ఆకుపచ్చటి నిమ్మకాయలను మాత్రమే తీసుకోవాలి. మచ్చలు ఉండకూడదు. సగానికి కోసి రసం పిండిన నిమ్మచెక్కను తిరగేసి అందులో నూనెపోసి, వత్తి పెట్టి పార్వతీదేవి ఆలయాల్లోనే వెలిగించాలి. మహా లక్ష్మి, సరస్వతీ అమ్మవార్ల దేవాలయాల్లో వెలిగించినట్లైతే ఆర్థిక వ్యవహారాల్లో నష్టం వాటిల్లుతుంది. పార్వతీ అమ్మవారి రూపా లైన ఆలయాల్లో మంగళ శుక్రవారాల్లో రాహుకాలంలో వెలిగిస్తే అధిక ఫలితం ఉంటుంది. పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి సందర్భాల్లో ఈ దీపాలు వెలిగించ కూడదు. దీపాన్ని నేలపై ఉంచకూడదు. దీపం కింద ధాన్యాన్ని లేదా తమల పాకును ఉంచి, కుంకుమబొట్టు పెట్టడం ఆచారం. దీపం వెలిగించిన తర్వాత పెరుగన్నం, నానబెట్టిన పెసరపప్పు, పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా వెలిగించడం వల్ల కుజ, కాలసర్పదోషాలు తొలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేరతాయి.

దూర్తి సుబ్రహ్మణ్య కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని