ప్రతర్దనః

విష్ణుసహస్రనామావళిలో ఇది 59 వది. నిఘంటుపరంగా ఈ నామానికి దురాత్ముడని అర్థం. కానీ ఆ చెడు ఏ ఒక్క వ్యక్తి మీదనో, అంశంపైనో కాదు. ప్రళయకాలంలో సృష్టి సర్వస్వాన్నీ అంతర్థానం లేదా నాశనం చేసేవాడని భావం.

Updated : 03 Aug 2023 04:34 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 59 వది. నిఘంటుపరంగా ఈ నామానికి దురాత్ముడని అర్థం. కానీ ఆ చెడు ఏ ఒక్క వ్యక్తి మీదనో, అంశంపైనో కాదు. ప్రళయకాలంలో సృష్టి సర్వస్వాన్నీ అంతర్థానం లేదా నాశనం చేసేవాడని భావం. తిరోధానంగా అప్పటికి తనలో లీనం చేసుకుని సమయం వచ్చినప్పుడు సృష్టించి విశ్వాన్ని తిరిగి నిలబెట్టేవాడు ఆ స్వామి. అంటే అప్పటికి నాశన మైందనుకున్నా అది స్వామి లోపల క్షేమంగా ఉంటుంది. ఇంతటి మహత్కార్యాన్ని చెయ్యగల సమర్థుడు ఆ శ్రీమహావిష్ణువు. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి తిరోధానం చెంది, ఆయన లోపల పదిలంగా ఉన్న సృష్టి సర్వస్వాన్నీ దర్శించాడని పురాణ కథలు ఉన్నాయి. ప్రళయకాలంలో సృష్టిని నశింపచేస్తాడనేది ఈ ప్రస్తావన. అంతేకానీ దురాత్ముడనే నిందార్థంలో కాదు.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని