నేను మార్గశిర మాసాన్ని!

ఈ జగత్తు మాయతో కూడిందని, తాత్విక జ్ఞానం కలిగినప్పుడే.. సర్వం జగన్నాథుడనే సత్యం బోధపడుతుందని శ్రీకృష్ణపరమాత్ముడు- అర్జునుడికి తెలియజేశాడు. సూర్యుడు, చంద్రుడు, తేజస్సు.. తన స్వరూపాలే అన్నాడు.

Published : 07 Dec 2023 00:04 IST

జగత్తు మాయతో కూడిందని, తాత్విక జ్ఞానం కలిగినప్పుడే.. సర్వం జగన్నాథుడనే సత్యం బోధపడుతుందని శ్రీకృష్ణపరమాత్ముడు- అర్జునుడికి తెలియజేశాడు. సూర్యుడు, చంద్రుడు, తేజస్సు.. తన స్వరూపాలే అన్నాడు. అలాగే మాసాల్లో తాను మార్గశిరం అన్నాడు. మార్గశిరంలో అధిక సంఖ్యలో పుణ్యతిథులు కనిపిస్తాయి. పండుగలు, జయంతులు ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి. సర్వ ఏకాదశి, గోవత్స ద్వాదశి, ముక్కోటి ఏకాదశి, మాసశివరాత్రి, చంద్ర దర్శనం మొదలైన పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. ధనుస్సంక్రమణంతో ధనుర్మాసం మొదలవుతుంది. నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవ అష్టమి పర్వదినాలు ఈ మాసంలోనే వస్తాయి. ధన్వంతరీ జయంతి, గీతాజయంతి, దత్తాత్రేయ జయంతి, రమణమహర్షి జయంతి ఈ మాసంలోనే వస్తాయి. హనుమ వ్రతం, ఆరుద్ర దర్శన మహోత్సవం- ఇలా అనేక విశేష దినాలు కలిసివస్తాయి. అన్నిటినీ మించి శ్రీకృష్ణపరమాత్మ తానే అని చెప్పిన మాసమిది. అందువల్లే మార్గశిరం విశిష్టమైంది, మహా దివ్యమైంది అనుకోవచ్చు.

ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని