రైతులకు ఇష్ట దైవం

ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లు వివిధ దేవుళ్లను ఆరాధిస్తారు. రైతులకు మాత్రం కుమారస్వామి ఇష్ట దైవం. ఎందుకంటే.. పైరు పెరిగే సమయంలో పొలాల్లో ఎలుకలు బొరియలు పెట్టి.. పైరుకు నీళ్లు అందకుండా చేస్తాయి.

Published : 14 Dec 2023 04:35 IST

డిసెంబర్‌ 18 సుబ్రహ్మణ్య షష్ఠి

ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లు వివిధ దేవుళ్లను ఆరాధిస్తారు. రైతులకు మాత్రం కుమారస్వామి ఇష్ట దైవం. ఎందుకంటే.. పైరు పెరిగే సమయంలో పొలాల్లో ఎలుకలు బొరియలు పెట్టి.. పైరుకు నీళ్లు అందకుండా చేస్తాయి. అలాగే పంటలు చేతికి వచ్చే కాలంలో.. కంకులను కొరికేస్తుంటాయి. దాంతో ధాన్యం రాలిపోతుంది. ఇలాంటి ఇబ్బందులు కలిగించే ఎలుకలను.. పాములు చంపి తినేస్తుంటాయి. పొలాల్లో నీరు నిల్వ చేయడం, పైరు పెరగడంలో అవరోధాలను తొలగించడం, కంకులు దెబ్బ తినకుండా చూడటం వంటి లాభాలు ఒనగూరుస్తూ రైతులకు మిత్రులుగా వ్యవహరిస్తుంటాయి పాములు. అందుకు కృతజ్ఞతగా సర్పరూపుడైన సుబ్రహ్మణ్య స్వామిని రైతులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలా రైతులకు ఇష్టదైవం అయ్యాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్కంద షష్ఠినాడు ఆ స్వామిని కావడి కట్టి పూజించడం ఆచారం. ఈ కావడిలో పాలు లేదా పంచదార ఉంచి.. కావడి మొక్కులు తీర్చుకుంటారు.                  

ఎల్‌. ప్రఫుల్ల చంద్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు