మరియమ్మ ఔన్నత్యం!

ఆమెకు దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. లోకంలోని స్త్రీలందరిలోకీ ప్రత్యేక గుర్తింపు ఉందామెకి.

Published : 08 Feb 2024 00:05 IST

ఫిబ్రవరి 9-11 గుణదల మేరీమాత శతాబ్ది ఉత్సవాలు

మెకు దేవుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. లోకంలోని స్త్రీలందరిలోకీ ప్రత్యేక గుర్తింపు ఉందామెకి. ఆమె అందరిలా కాకుండా పవిత్రాత్మ ప్రభావంతో గర్భం దాల్చింది. ఆమెకి పుట్టింది సామాన్య మానవుడు కాడు, దైవకుమారుడు. ఆమే కన్య మరియ, ఏసుక్రీస్తును కన్న తల్లి. ఏసును లాలించి పెంచింది. దేవుడికే తల్లి అయిన మరియమ్మ.. దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా మాతే కదా! ఇంతకూ దేవునికి తల్లి కావడం అంటే మాటలా! ఎన్ని అర్హతలుండాలి? అమ్మ ప్రాధాన్యత చెప్పడానికి ఎన్ని గ్రంథాలూ చాలవు. ఎంత నిర్వచించినా, ఎన్ని వివరణలు ఇచ్చినా ఆ సమగ్రత పూడ్చలేనిది. మేరీ మాత గురించి బైబిల్లో తక్కువ సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆమె ఔన్నత్యం గురించి స్పష్టంగా, మహోన్నతంగానే కనిపిస్తుంది. ఏసుకు జన్మనిచ్చేందుకు మరియమ్మను ఎంచుకుని.. ఆమెని మహా స్త్రీమూర్తి స్థానంలో నిలబెట్టాడు దేవుడు.

ఏసు ప్రభువుకు వలెనే మీరీమాతనూ ఆరాధిస్తారు. మరియ చాలా చోట్ల చాలామందికి దర్శనం ఇచ్చింది. మరియమ్మను ప్రశాంతతకు, పరమ పవిత్రతకూ నిలయంగా, మాతృత్వానికి ప్రతీకగా క్రైస్తవులు నమ్ముతారు. ఆ భక్తితోనే గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

డా.ఆర్‌.వి.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని