Shani-trayodashi: మే 28న శని త్రయోదశి.. ఏ రాశుల వారు ఏం చేయాలంటే?

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఈ నెల 28న వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి శనివారం.....

Updated : 14 Mar 2023 15:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఈ నెల 28న వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి శనివారం వచ్చింది. శని నుంచి ఎదురయ్యే ఈతి బాధలు తొలగించుకొనేందుకు ఈ రోజును ఉత్తమమైనదిగా జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శని త్రయోదశి రోజున ఏ వ్యక్తి అయినా నవగ్రహ ఆలయంలో శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి శని స్తోత్రం జపించవచ్చు. ఆ రోజు నువ్వులతో చేసిన ప్రసాదాన్ని శని భగవానుడికి సమర్పించి, అందరికీ నువ్వుల ఉండలను పంచిపెడితే శని అనుగ్రహం కలుగుతుంది.

జాతక చక్రంలో శని దోషాలు ఉన్నవారికి గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధ అష్టమ శని సంచరించే వారికి, శని మహర్దశ అంతర్దశ నడిచే వారు ఈరోజున ప్రత్యేక పూజలు చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. శని త్రయోదశి రోజు శని భగవానుడికి చేసే పూజ/ఆరాధన/అభిషేకాలు శుభ ఫలితాలనివ్వడంతో పాటు భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. 2022లో మకర రాశి, కుంభరాశి, మీన రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు ఈ శని త్రయోదశి రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయడం వల్ల శని దోషాలు తొలగి అనుగ్రహం కలుగుతుంది. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి..

‘‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’

- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని