ఏకాదశి ఏంటి?

ప్రత్యేకంగా చేసుకునే పండగల మాట అటుంచితే ప్రతి ఏకాదశిని పర్వదినంగా భావించే సంప్రదాయం మనకుంది. మిగిలిన రోజులతో

Updated : 14 Mar 2023 16:05 IST

ప్రత్యేకంగా చేసుకునే పండగల మాట అటుంచితే ప్రతి ఏకాదశిని పర్వదినంగా భావించే సంప్రదాయం మనకుంది. మిగిలిన రోజులతో పోల్చితే ఆ తిథిని ఉత్తమంగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనకు అనువైన రోజుగా చెబుతారు. మనిషికి అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మనసుతో కలిపితే అవి పదకొండు.అంటే ఏకాదశ ఇంద్రియాలు. దీన్ని ఆలంబనగా చేసుకునే ఏకాదశి తిధికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఈ పదకొండు ఇంద్రియాలూ లోపరహితంగా ఉంటే అది సంపూర్ణత్వం. లోపం లేకుండా ఉండడాన్ని వికుంఠం అంటారు. అలాంటి లోపరహితంగా తీర్చిదిద్దే రోజును వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. ధనుర్మాసంలో పూర్ణిమకు ముందువచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఇది మార్గశిర మాసంలోగానీ, పుష్యమాసంలోగానీ వస్తుంది. దీంతోపాటు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. ఈ రెండూ విష్ణు ఆరాధనకు మనకు అవకాశం ఇచ్చే పర్వదినాలు. ఇవికాక ప్రతినెలా రెండు పక్షాల్లో వచ్చే ఏకాదశి తిథులు రెండూ పర్వదినాలే.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు