Viral Video:గగనతలంలో అధ్యక్షుడి విమానం డేంజరస్ స్టంట్..!
Viral Video:గగనతలంలో ఓ విమానం ప్రమాదం అంచుల్లోకి వెళ్లింది. పొరపాటును గుర్తించి పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.
బ్యూనస్ ఎయిర్స్: రన్‌వేకు అత్యంత సమీపంలో గాల్లో ఒడుదొడుకులకు లోనైందీ ఓ విమానం. అది సాక్షాత్తూ ఒక దేశ అధ్యక్షుడు విమానం కావడం గమనార్హం. అయితే పైలట్లు ఉద్దేశపూర్వకంగా ఈ ప్రమాదకర స్టంట్‌ను చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఎడమవైపు మలుపు తిరిగే ముందు పట్టు అది పట్టుతప్పింది. దాంతో అది భూమికి అత్యంతసమీపానికి వచ్చింది. తర్వాత పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది. దీనిని గమనించిన కొందరు తీసిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వాటిని చూస్తుంటే విమానం ఓ వైపునకు ఒరిగిపోయినట్లు కనిపిస్తోంది. ‘అర్జెంటీనా అధ్యక్షుడి కొత్త విమానం చివరి క్షణంలో తనను తాను అద్భుతంగా రక్షించుకుంది’అని ఓ నెటిజన్ ఆ వీడియోను ట్వీట్ చేశారు. అయితే ఆ సమయంలో విమానంలో అధ్యక్షుడు లేకపోవడం గమనార్హం. ఈ వీడియో వెంటనే నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘బాధ్యతారాహిత్యానికి ఇది నిదర్శనం. ఇక్కడ ఏదైనా అనుకోనిది జరిగి ఉంటే..?’అని ఒకరు తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rahul Dravid: వాళ్లెందుకు బౌలింగ్ చేయరంటే.. కారణం చెప్పిన ద్రవిడ్
-
Balakrishna: నా వైపు వేలు చూపుతూ.. రెచ్చగొట్టారు: తెదేపా ఎమ్మెల్యే బాలకృష్ణ
-
Cricket World Cup: ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం
-
తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా రాళ్ల దాడి
-
TRT: టీఆర్టీ సిలబస్‌లో స్వల్ప మార్పు
-
Hyderabad: సూరీడు, ఏపీ ఐజీ పాలరాజు సహా ముగ్గురు పోలీసులపై కేసు