Viral Video: సూదంటే భయం!
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో పలువురు తాము టీకా తీసుకున్నట్టుగా ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ తరుణంలో పలువురు తాము టీకా తీసుకున్నట్టుగా ఫోటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. టీకా వేసేటప్పుడు ఇంజక్షన్ భయం ఉన్నవాళ్లు మాత్రం చాలా హంగామా చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నవ్వులు పండిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన మాగ్యుల్ జూనియర్ అనే వ్యక్తి టీకా తీసుకోవడానికి భయపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. నిలబడి ఉండగానే టీకా వేసినందుకు నర్సులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ, కొందరు మాత్రం వీడియో సరదాగా ఉందని కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మాగ్యుల్కు సూపర్ ఫోబియా ఉందని, ఇంజెక్షన్లంటే భయమని అతని స్నేహితుడు చెబుతున్నాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్‌లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్‌తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?