Viral Video: విమానానికి వేలాడుతూ మహిళ వర్కౌట్లు.. వీడియోకు 50మిలియన్ల వ్యూస్!
ఇంటర్నెట్ డెస్క్: పురుషులు సాహసాలు చేసే వీడియోలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, మహిళలు అలాంటి రిస్కీ ఫీట్లు చేయడం అరుదు. అయితే వేల మీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఓ విమానానికి వేలాడుతూ.. ఓ మహిళ వర్కౌట్లు చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. విమానాన్ని పట్టుకొని వర్కౌట్లు చేయడమే కాదు.. అక్కడి నుంచి స్కై డైవింగ్ కూడా చేసింది.
స్కైడైవర్ కేటీ వసేనినా తన ఫీట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా అది తెగ వైరలవుతోంది. ఇప్పటికే ఆ క్లిప్పింగ్‌ను దాదాపు 49.3మిలియన్ల మంది వీక్షించారు. 5.7లక్షల మంది లైక్ చేశారు. వసేనినా సాహసాన్ని పొగిడేస్తూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అద్భుత ఫీట్. ఊపిరి బిగబట్టేలా చేశావు’ అని పలువురు కామెంట్లు చేశారు. ‘నాకు అది గుండెపోటును తెప్పించేలా అనిపించింది. కానీ, నువ్ మాత్రం సులభంగా చేసేశావు’ అని మరికొందరు పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.