Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్‌’.. వైరల్‌గా మారిన వీడియో

ఓ ఎస్సై, మరో కానిస్టేబుల్‌ ‘నాగిని డ్యాన్స్‌’ స్టెప్పులతో అదరగొడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది........

Updated : 21 Nov 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఓ ఎస్సై, మరో కానిస్టేబుల్‌ ‘నాగిని డ్యాన్స్‌’ స్టెప్పులతో అదరగొడుతున్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. చుట్టూ చేరిన ఇతర పోలీసు సిబ్బంది వారిని ఉత్సాహపరుస్తుండగా.. ఆ ఇద్దరు నాగిని మ్యూజిక్‌కు తగ్గట్టుగా స్టెప్పులేశారు. యూపీలోని కొత్వాలీ జిల్లాలో జరిగిన స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిందీ ఘటన. 

జైకీ యాదవ్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ఈ వీడియోను పోస్టు చేయగా.. అది  తెగ వైరలవుతోంది. ఇప్పటివరకు దాదాపు 75వేల మందికిపైగా వీక్షించారు. కాగా నెటిజన్లంతా ఈ వీడియోకి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇలాంటివి పోలీసులపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంటున్నారు. పోలీసులు కూడా కొన్నిసార్లు కాలుకదపడం వల్ల ఎవరికీ నష్టం లేదని మరో నెటిజన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ పోలీసులు మల్టీ ట్యాలెంటెడ్‌ అని మరికొందరు ప్రశంసిస్తున్నారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని