Viral Video: పెళ్లి వేదిక మీద వరుడికి చెప్పు దెబ్బ
ఓ తల్లి, తన కుమారుడు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని కోపగించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ తల్లి, తన కుమారుడు తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటున్నాడని కోపగించుకుంది. ఆమె కోపాన్ని చూపించడానికి పెళ్లి మండపాన్ని ఎంచుకుంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటున్న సమయంలో ఫోటోగ్రాఫర్‌ను పక్కకు నెట్టి పెళ్లి వేదిక మీదకు వచ్చింది. కాగా పెళ్లి కొడుకు తనను ఆశీర్వదిండానికి వస్తుందేమోనని అనుకున్నాడు. కానీ, ఆమె కాలికున్న చెప్పుతీసి ఒక్కసారిగా అతడి మీద దాడి చేసింది. దాంతో వరుడు కంగుతిన్నాడు. అమెనుంచి తప్పించుకోవడానికి వధువు వెనకకు వెళ్లి దాక్కున్నాడు. ఆద్యంతం నవ్వులు పూయిస్తున్న ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్, హమీర్ పూర్లోని సుమేర్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్‌తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్‌ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!