ఆఫీసు యోగా

గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చొని అలసిపోతున్నారా? ప్రాజెక్టు వర్క్‌లో తలమునకలై ఒత్తిడికి గురవుతున్నారా? వ్యాయామం చేసే సమయం లేక సతమతమవుతున్నారా?...

Published : 13 Oct 2018 13:37 IST

ఆఫీసు యోగా

గంటల తరబడి కంప్యూటర్‌ ముందు కూర్చొని అలసిపోతున్నారా? ప్రాజెక్టు వర్క్‌లో తలమునకలై ఒత్తిడికి గురవుతున్నారా? వ్యాయామం చేసే సమయం లేక సతమతమవుతున్నారా? భయపడకండి.. మీరు కూర్చొన్న చోటే... కొంచెం సమయంలోనే యోగ సాధన ద్వారా మొత్తం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరాన్ని తేలిక చేసుకోవచ్చు. పూర్వపు ఉత్తేజాన్ని పొంది... పనిలో నిమగ్నం కావచ్చు అంటున్నారు యోగా నిపుణులు. ఇంకెందుకాలస్యం... కూర్చొన్న చోటే ఈ యోగాను మూడు గంటలకు ఒకసారి సాధన చేసేయండి.

ఆఫీసు యోగా

చిత్రంలో చూపినట్లు 8-10 సెకన్ల పాటు కుడి, అంతే సమయం ఎడమ వైపులకు శరీరాన్ని వంచాలి. ఇలాగే 3 నుంచి నాలుగుసార్లు చేయాలి.

ఆఫీసు యోగా

8-10 సెకన్ల పాటు ఒకసారి కుడి, మరోసారి ఎడమ చేతులను పైకి ఎత్తి ఉంచాలి.

ఆఫీసు యోగా  

8-10 సెకన్ల పాటు కుడి, ఎడమ వైపులకు తలను వంచాలంతే.

ఆఫీసు యోగా  
10-15 సెకన్ల పాటు వీపు భాగాన్ని రిలీఫ్‌ చేయాలి.

ఆఫీసు యోగా

10-15 సెకన్ల పాటు రెండు చేతులను ఇలా పైకి, ముందుకు సాగేట్లు చేస్తే చాలు.

ఆఫీసు యోగా

8-10 సెకన్ల పాటు కుడి, ఎడమ వైపులకు ఇలా శరీరాన్ని తిప్పితే బడలిక తీరుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని