Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన అధికార ప్రతినిధిపై
అమరావతి: మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన అధికార ప్రతినిధిపై వైకాపా ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని పవన్ తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే. కానీ, స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగితే బలంగా సమాధానం చెబుతాం. మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఫోన్ చేసి అమర్యాదకరంగా మాట్లాడటం ఏం పద్ధతి? ఈవిషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలిపారు. ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాను బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం. రెండు టీవీ ఛానెళ్లపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఎమ్మెల్యే బాలినేనికి చెప్పేది ఒక్కటే... మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి. రాజకీయాల్లో విధి విధానాలపై మాట్లాడుకుంటాం... వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదు. టీవీఛానెళ్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుని సమస్యకు ముగింపు పలకాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
Mayawati: డిసెంబర్లో తన రాజకీయ వారసుడిగా మాయావతి తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్‌ను ప్రకటించారు. తాజాగా కీలక బాధ్యతల నుంచి ఆయన్ని తొలగిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టం.. రైతుల భూముల్ని కొల్లగొట్టేందుకే
ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దొడ్డిదారిన అమలు చేసేందుకు సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఎన్డీయే నేతలు విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు?
ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. -
నూర్‌బాషాల సంక్షేమానికి కూటమి మ్యానిఫెస్టోలో రూ.100 కోట్లు కేటాయిస్తామనడం హర్షనీయం
నూర్‌బాషాల సంక్షేమానికి రూ.వంద కోట్లు కేటాయిస్తామని తెదేపా, జనసేన మ్యానిఫెస్టోలో చెప్పడం హర్షనీయమని తెదేపా నూర్ బాషా నాయకులు నాగుల్‌మీరా, పీర్ మహ్మద్బుజ్జి, షేక్ సుభాని, నాగుల్ అన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఉరితాడే
రాష్ట్రంలోని ఇసుక, గనులతో పాటు అన్ని సహజవనరులను దోచుకున్న సీఎం జగన్ ఇప్పుడు ప్రజల ఆస్తులపై కన్నేశారని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు. -
హరియాణా రాజకీయాల్లో కలకలం
హరియాణాలో అధికార భాజపా ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము మద్దతు ఉపసంహరిస్తున్నట్లు ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యులు మంగళవారం ప్రకటించారు. -
అయిదో రోజు మరో ఏడుగురు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వంలో ఐదో రోజు మంగళవారం మరో ఏడుగురు అభ్యర్థులు కొత్తగా నామినేషన్ వేశారు.