తల్లి పింఛను సొమ్ము తీసుకొని.. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన తనయుడు

సమాజంలో నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలకు దర్పణం పడుతోంది ఈ ఘటన. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డకు ఆ తల్లి బరువైంది. వృద్ధాప్యంలో

Updated : 03 May 2022 09:25 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: సమాజంలో నానాటికీ దిగజారుతున్న మానవ సంబంధాలకు దర్పణం పడుతోంది ఈ ఘటన. నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డకు ఆ తల్లి బరువైంది. వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నకుమారుడే తన తల్లిని భారంగా భావించి వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లెలో నిర్ధాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. ఒకరోజు తర్వాత స్థానిక నేతల జోక్యంతో ఆ వృద్ధురాలిని ఆశ్రమానికి తరలించారు. చక్రాయపేట మండలం అగ్రహారానికి చెందిన అనుమక్క ఆదివారం వాలంటీరు ద్వారా సామాజిక పింఛను అందుకుంది. ఆ పింఛను మొత్తాన్ని కుమారుడు వెంకటరమణ తీసుకున్నాడు. ఆటోలో వేంపల్లెకు తీసుకొచ్చి స్థానిక మెయిన్‌ బజార్‌లో తన తల్లిని వదిలేసి వెళ్లాడు. ఆ రోజంతా ఆమె అక్కడే ఉండిపోయింది. సోమవారం ఈ సమాచారం తెలుసుకున్న వేంపల్లె ఎంపీటీసీ సభ్యుడు కటిక చంద్ర, ముత్యాల రమేష్‌బాబు, ప్రసాద్‌ ఈ విషయాన్ని స్థానిక రాజీవ్‌నగర్‌ కాలనీలోని మదర్‌ థెరిసా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు వెంకటసుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లి ఆమెను అక్కడికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని