వీల్‌ఛైర్‌కు పరుగు నేర్పుతున్న యువకులు!

అంబులెన్సులు వెళ్లలేని ఇరుకు సందుల్లోకి వెళ్లి రోగిని తీసుకొచ్చేలా మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌ను రూపొందించారు ముగ్గురు యువకులు. పట్టణాలు, నగరాలకే కాదు..

Published : 26 Jun 2022 05:09 IST

అంబులెన్సులు వెళ్లలేని ఇరుకు సందుల్లోకి వెళ్లి రోగిని తీసుకొచ్చేలా మూడు చక్రాల బ్యాటరీ సైకిల్‌ను రూపొందించారు ముగ్గురు యువకులు. పట్టణాలు, నగరాలకే కాదు.. అంబులెన్సులు అందుబాటులో లేనప్పుడు గ్రామీణులకూ ఉపయోగపడేలా ఇంకా మెరుగుపరుస్తున్నారు. కేఎల్‌ విశ్వవిద్యాలయంలో ట్రిపుల్‌ఈ పూర్తిచేసిన చరణ్‌, కిరీటి, లోకేశ్‌ ఈ బ్యాటరీ వీల్‌ఛైర్‌ను రూపొందించారు. సాధారణ చక్రాల కుర్చీనే సైకిల్‌కు అనుసంధానించి, బ్యాటరీతో నడిచేలా, ఛార్జింగ్‌ లేనప్పుడు సైకిల్‌లా తొక్కుకెళ్లేలా మలిచారు. రహదారులు లేని ప్రాంతాల్లో, ఇరుకైన దారుల్లో సైతం వెళ్లి రోగులను తీసుకొచ్చేందుకు దీన్ని తయారు చేసినట్లు యువకులు తెలిపారు. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ప్రయాణిస్తుందని, ఇంకా చేయాల్సిన మార్పుల కోసం పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల విజయవాడ కేదారేశ్వరపేట రహదారిపై ప్రయోగాత్మకంగా నడిపి చూశారు.

-ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని