ఆరు ఖండాల్లో మువ్వన్నెల రెపరెపలు

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దేశ నౌకాదళం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. అంటార్కిటికా మినహా మిగిలిన ఆరు

Published : 07 Aug 2022 03:23 IST

నౌకాదళం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర అమృతోత్సవాలు

విశాఖపట్నం(సింధియా), న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో భాగంగా దేశ నౌకాదళం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. అంటార్కిటికా మినహా మిగిలిన ఆరు ఖండాల్లోని పలు దేశాల పోర్టుల్లో భారతీయ యుద్ధనౌకలపై జాతీయ జెండాలు ఎగురవేసేలా ఏర్పాట్లు చేసింది. ఈ జాబితాలో.. ఆసియా ఖండానికి సంబంధించి మస్కట్‌ (ఒమన్‌) పోర్టులో ఐఎన్‌ఎస్‌ చెన్నై, ఐఎన్‌ఎస్‌ బెత్వా నౌకలపై, సింగపూర్‌లో ఐఎన్‌ఎస్‌ సరయు, ఆఫ్రికా ఖండంలోని మాంబసా(కెన్యా)లో ఐఎన్‌ఎస్‌ త్రిఖండ్‌, ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఐఎన్‌ఎస్‌ సుమేధ, ఉత్తర అమెరికాలోని శాన్‌డియాగో (అమెరికా)లో ఐఎన్‌ఎస్‌ సాత్పురా, దక్షిణ అమెరికాలోని రియో డి జెనీరో (బ్రెజిల్‌)లో ఐఎన్‌ఎస్‌ తర్క్‌ష, యూరోప్‌లోని లండన్‌ (బ్రిటన్‌)లో ఐఎన్‌ఎస్‌ తరంగిణి నౌకలపై మువ్వన్నెల పతాకాలు ఎగురవేయనుంది. ఆరు ఖండాలతో పాటు మూడు మహాసముద్రాలు, ఆరు జోన్ల సమయాల్లో జెండా వందనం సమర్పించనుంది. ముంబయి తీరంలో భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని