స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 195 మంది జీవిత ఖైదీలు విడుదల

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 195 మంది జీవిత ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలుగా గుర్తించిన వీరందరినీ

Published : 15 Aug 2022 05:39 IST

ఈనాడు, అమరావతి: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా 195 మంది జీవిత ఖైదీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలుగా గుర్తించిన వీరందరినీ శిక్షకాలం పూర్తికాక ముందే విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. వీరంతా విడుదల కోసం రూ.50 వేల విలువైన బాండు సమర్పించాలి. మిగతా శిక్ష కాలం పూర్తయ్యేంత వరకూ ప్రతి మూడు నెలలకోసారి స్థానిక పోలీసుస్టేషన్‌లో హాజరుకావాలి. ఎవరైనా మళ్లీ నేరానికి పాల్పడితే వారికి ఇచ్చిన మినహాయింపు రద్దవుతుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌కుమార్‌ గుప్తా ఆదివారం ఉత్తర్వులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని