ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: శివారెడ్డి

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మహా పాదయాత్రకు విశేష స్పందన లభించిందని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి వద్ద ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో

Published : 26 Sep 2022 04:38 IST

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మహా పాదయాత్రకు విశేష స్పందన లభించిందని అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలం కొనికి వద్ద ఆదివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి వైకాపా మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. న్యాయస్థానాలు, రాజ్యాంగంపై ఆ పార్టీ నాయకులకు కనీస గౌరవం లేదని విమర్శించారు. నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని అతిథి గృహంలో ఉత్తరాంధ్ర నాయకులను సమావేశపరిచి పాదయాత్రకు అడ్డంకులు సృష్టించాలని విద్యార్థులను, కులసంఘాల నాయకులను రెచ్చగొట్టారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు ఆరోపించారు. 5 నిమిషాలు కన్నెర్ర చేస్తే యాత్రలన్నీ ఆగిపోతాయని విద్యాశాఖ మంత్రి పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. అనేక సార్లు మంత్రిగా ఉన్నా విజయనగరం జిల్లా అభివృద్ధి చేయలేనివారు అమరావతి గురించి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. తమను భయభ్రాంతులను చేయాలని ప్రయత్నించిన వైకాపా నాయకుల కుయుక్తులను కృష్ణా జిల్లాలో అశేష ప్రజానీకం తిప్పికొట్టిందని అమరావతి దళిత ఐకాస సభ్యురాలు శిరీష పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని