ఎంఎస్‌ఎంఈలకు తెలంగాణలో ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు

రాష్ట్రంలో గత మూడేళ్లలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,325 కోట్ల ప్రోత్సాహకాలు అందించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

Published : 01 Oct 2022 03:23 IST

చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ రూ.1325 కోట్లు: మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లి పట్టణం, నెహ్రూచౌక్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గత మూడేళ్లలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.1,325 కోట్ల ప్రోత్సాహకాలు అందించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. అనకాపల్లిలో శుక్రవారం ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుపై జాతీయస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సును ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటున్న తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో  ఎంఎస్‌ఎంఈలకు ఒక్క రూపాయి ప్రోత్సాహం కూడా ఇవ్వలేదన్నారు. పెద్ద పరిశ్రమలు సాంకేతికతను వినియోగించుకుని తక్కువ మందికే ఉపాధిని అందిస్తున్నాయన్నారు. అదే చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధిని కల్పిస్తాయని.. వీటిని ఏర్పాటు చేయించేలా ప్రభుత్వం చొరవ చూపుతుందని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ అదనపు డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విశాఖపట్నంలో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న ఎంఎస్‌ఎంఈ భవనాన్ని వచ్చే నెలలో ప్రారంభిస్తున్నామన్నారు. విజయవాడ, తిరుపతిలో మరో రెండు భవనాలను నిర్మించేందుకు యోచిస్తున్నామన్నారు. ఈ సదస్సులో అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని