Andhra News: ఇల్లు కూల్చివేత.. పోలీస్‌స్టేషన్‌ వద్ద వర్షంలో తడుస్తూ వృద్ధురాలి నిరసన

తన ఇల్లు కూల్చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వృద్ధురాలు పోలీసుస్టేషన్‌ ఎదుట జోరువానలో నిరసన తెలిపిన వైనమిది.

Updated : 24 Nov 2022 08:37 IST

చేజర్ల, న్యూస్‌టుడే: తన ఇల్లు కూల్చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వృద్ధురాలు పోలీసుస్టేషన్‌ ఎదుట జోరువానలో నిరసన తెలిపిన వైనమిది. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్లలో జరిగింది. మండలంలోని బిల్లుపాడుకు చెందిన బి.లక్ష్మమ్మకు చెందిన లక్ష్మమ్మకు నలభై ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలం ఇచ్చింది. అది ఖాళీగానే ఉండడంతో అధికారులు జగనన్న కాలనీ పథకం కింద లక్ష్మమ్మకు కోడలు వరసైన రాజేశ్వరి అనే మహిళకు పట్టా ఇచ్చారు. తన స్థలాన్ని ఇతరులకు ఎలా ఇస్తారని లక్ష్మమ్మ అభ్యంతరం తెలిపి ఇటీవలే అందులో పూరిల్లు కట్టుకుంది. దీన్ని గత శుక్రవారం బంధువులతో కలసి రాజేశ్వరి కూల్చివేయగా వివాదం నెలకొంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లక్ష్మమ్మ బుధవారం మధ్యాహ్నం పోలీసుస్టేషన్‌కు వచ్చారు. ఎస్సై అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లడంతో రాత్రి వరకు వర్షంలోనే నిరసన తెలిపి వెళ్లారు. దీనిపై తహసీల్దారు బి.శివకృష్ణయ్యను వివరణ కోరగా, ఒకే స్థలం కావాలని లక్ష్మమ్మ, రాజేశ్వరి తరచూ వివాదానికి దిగుతున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని