గురుకులాల్లోనూ ముఖ హాజరు: మంత్రి నాగార్జున

గురుకుల పాఠశాలల్లోనూ విద్యార్థులకు ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు.

Updated : 24 Nov 2022 05:31 IST

ఈనాడు, అమరావతి: గురుకుల పాఠశాలల్లోనూ విద్యార్థులకు ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఆయన ఎస్సీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలపై సమీక్షించి మాట్లాడారు. ‘కొన్ని పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులు కానివారిని అవసరమైతే పోలీసుల సాయంతో తొలగించాలి. విద్యార్థులకు గుర్తింపుకార్డులు జారీచేయాలి. వాచ్‌మన్లు లేనిచోట వారిని నియమించాలి’ అని మంత్రి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని