మిసెస్‌ ఆసియాగా సఖినేటిపల్లి మహిళ

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది.

Published : 29 Nov 2022 03:33 IST

సఖినేటిపల్లి, రాజోలు, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సరోజ అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరు లాస్‌ఏంజెల్స్‌లో నివసిస్తున్నారు. సరోజ మిసెస్‌ ఆసియాగా ఎంపిక కావటం పట్ల ఆమె చిన్నాన్న అల్లూరి ప్రసాదరాజు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని