రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన

పెండింగ్‌ వేతనాలు అందించాలని, కార్మికుల తొలగింపు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు సోమవారం భిక్షాటన చేశారు.

Published : 29 Nov 2022 04:54 IST

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడ), న్యూస్‌టుడే: పెండింగ్‌ వేతనాలు అందించాలని, కార్మికుల తొలగింపు ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాజధాని అమరావతి ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు సోమవారం భిక్షాటన చేశారు. లెనిన్‌ సెంటర్‌ నుంచి ర్యాలీగా వచ్చి గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌యాదవ్‌కు వినతిపత్రం అందించారు. కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ, రాజధాని ప్రాంత కార్మికుల యూనియన్‌ కార్యదర్శి రవి తదితరులు మాట్లాడుతూ... రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, అమరావతి ప్రాంత గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని వివరించారు. కార్మికులను జనవరి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం దుర్మార్గమన్నారు. సీఆర్‌డీఏ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ కార్మికుల వద్దకు వచ్చి... వెంటనే వేతన బకాయిలు విడుదల చేస్తామని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని