Andhra News: జీన్స్‌, టీ షర్టులు వేసుకోవద్దు!

వైద్య విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టంచేసింది.

Updated : 02 Dec 2022 11:52 IST

వైద్య విద్యార్థులకు డీఎంఈ ఆదేశాలు!

ఈనాడు, అమరావతి: వైద్య విద్యార్థులు జీన్స్‌ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టంచేసింది. అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు చీర లేదా చుడీదార్లు మాత్రమే ధరించాలని సూచించింది. డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో ఈ డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించింది.

ఎంబీబీఎస్‌, పీజీ వైద్య విద్యార్థులు శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలి. గడ్డం గీసుకోవాలి. మహిళలు జుట్టు వదిలేయొద్దు. తప్పనిసరిగా స్టెతస్కోప్‌, యాప్రాన్‌ను ధరించాలి అని సూచించింది. నిర్దేశించిన డ్రస్‌ కోడ్‌ను కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది పాటించకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సి వస్తే.. సహాయకులు లేరని తిరస్కరించొద్దని తెలిపింది. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు