పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ ఆరోపించారు.

Updated : 04 Dec 2022 06:05 IST

ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ

విశాఖపట్నం (డాబాగార్డెన్‌), న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితాలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ ఆరోపించారు. శనివారం విశాఖ అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత లేకపోయినా కొందరి పేర్లను జాబితాలో చేర్చారన్నారు. 3, 5, 10వ తరగతులు, ఇంటర్‌, డిప్లొమో చదివిన వారు, ఆఖరికి నిరక్షరాస్యుల పేర్లనూ అందులో చేర్చారని వివరించారు. ఎన్నికల కమిషన్‌, జిల్లా కలెక్టర్‌ స్పందించి ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అక్రమాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని