Kavali DSP- YSRCP: స్వామిభక్తి చాటుకున్న కావలి డీఎస్పీ

సీఎం పర్యటనలో భాజపా నాయకుల ఆందోళనను అడ్డుకోవడంలో కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ స్వామిభక్తి చాటుకున్నారు.

Updated : 13 May 2023 09:24 IST

కావలి, న్యూస్‌టుడే: సీఎం పర్యటనలో భాజపా నాయకుల ఆందోళనను అడ్డుకోవడంలో కావలి డీఎస్పీ ఎం.వెంకటరమణ స్వామిభక్తి చాటుకున్నారు. ఆయన ఆరునెలల కిందటి వరకు తిరుపతి స్పెషల్‌ బ్రాంచిలో పనిచేస్తూ కావలిలో లా అండ్‌ ఆర్డర్‌కు సంబంధించి సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారిగా వచ్చి చేరారు. స్థానిక ఎమ్మెల్యే సిఫారసులు లేకుండా నేరుగా వచ్చి చేరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆయనకు డీజీపీ ఆశీసులున్నాయని సమాచారం. అంతకుముందున్న డీఎస్పీపై వచ్చిన ఆరోపణలు డీజీపీ స్థాయికి తీసుకెళ్లడంలో కావలికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉదయగిరి పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు ప్రత్యేకంగా చొరవ చూపారు. ఈ నేపథ్యంలో కావలిలో డీఎస్పీగా ఎవరినీ నియమించలేదు. కందుకూరు డీఎస్పీకే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఎట్టకేలకు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా స్పెషల్‌ బ్రాంచి నుంచి వెంకటరమణను లా అండ్‌ ఆర్డర్‌ డీఎస్పీగా కావలికి తీసుకొచ్చారు. సీఎం పర్యటనలో భాగంగా నిర్వహించే నిరసనల్లో అపశ్రుతి దొర్లితే ప్రభుత్వం వద్ద డీజీపీకి ఇబ్బంది ఎదురవుతుందని భావించిన డీఎస్పీ వెంకటరమణ  స్వామిభక్తి ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. అందుకే భాజపా నాయకులతో ఆయన కఠినంగా వ్యవహరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని