AP News: ఏపీలో 180 డిగ్రీ కళాశాలల మూసివేత

రాష్ట్రంలో ఈ ఏడాది 180 ప్రైవేటు డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,008 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.

Updated : 15 Jul 2023 08:58 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది 180 ప్రైవేటు డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం మూసివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,008 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 150 కళాశాలలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను నిర్ణయించలేదు. మరో 30 కళాశాలలు బోధన రుసుములు  నిర్ణయించేందుకు కమిషన్‌కు ఆర్థిక వ్యవహారాలను సమర్పించలేదు. దీంతో ఈ ఏడాది వాటిలో ప్రవేశాలను ప్రభుత్వం నిలిపివేసింది. విద్యార్థుల ప్రవేశాలు 25శాతం కంటే తక్కువగా ఉన్నందున 150 కళాశాలలకు ఫీజులను నిర్ణయించలేదని ప్రభుత్వం ప్రకటించింది. 25శాతంలోపు ప్రవేశాలు ఉంటే విద్యా సంస్థల నిర్వహణ లాభదాయకంగా ఉండదని, నాణ్యమైన విద్య, బోధన అందించడం సాధ్యం కాదని పేర్కొంది.

కౌన్సిలింగ్‌ మరోసారి వాయిదా..

డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్‌ను ఉన్నత విద్యామండలి మరోసారి వాయిదా వేసింది. ఇప్పటికే 2 సార్లు గడువు పెంచగా.. ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రవేశాల రిజిస్ట్రేషన్లను ఈనెల 17వరకు పొడిగించింది. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలకు ఈనెల 20 నుంచి అవకాశం కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని